
రామచంద్రాపురం/పటాన్‌చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని వెలిమెల గ్రామాన్ని బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి నూతన గృహ ప్రవేశం సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
25 ఏండ్లుగా వెలిమెల గ్రామంలో మంత్రి వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ విజయవంతంగా కొనసాగుతోంది. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచే విఠల్‌రెడ్డి మంత్రికి సన్నిహితుడిగా ఉంటున్నారు. ఆయన ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రామస్తులు, అభిమానులు, స్థానిక నేతలు హాజరయ్యారు.