జైపూర్(భీమారం)వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామి భూ కబ్జాలను సహించరని మంచిర్యాల జిల్లా భీమారం కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ పోడేటి రవి అన్నారు. వివేక్ అనుచరులు భూ కబ్జాలు చేశారనే ప్రతిపక్ష లీడర్ల ప్రచారాన్ని గురువారం ఆయన ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ పబ్బం గడుపు కోవడానికి మంత్రి వివేక్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారన్నారు. కొందరు జర్నలిజం ముసుగులో మంత్రిపై, ఆయనకు చెందిన ‘వెలుగు’ పేపర్‌పై చేస్తున్న ప్రచారాలు అవాస్తమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా సెక్రటరీలు వేల్పుల శ్రీనివాస్, రాజమణి, వైస్ ప్రెసిడెంట్ సత్తి రెడ్డి, సీనియర్ లీడర్లు పాల్గొన్నారు.
మంత్రి వివేక్ చొరవతో బోర్ వెల్ పనులు ప్రారంభం
భీమారం మండల కేంద్రంలో మంత్రి వివేక్ చొరవతో కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.2 లక్షలతో రెండు బోరువెల్స్ పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోడేటి రవి, సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని మాధవ రెడ్డి కాలనీ లోని 15 కుటుంబాలు నీటి సమస్య ఉందని మంత్రి వివేక్ దృష్టికి తీసుకు పోవడంతో బోర్ వెల్ మంజూరు చేశారన్నారు.
