కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, జైపూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మందమర్రి పాత బస్టాండ్ శాంతి నగర్ కు చెందిన మెరుగు పోషం, దీపక్ నగర్ కు చెందిన బుర్ర శ్రీనివాస్ గౌడ్ కొడుకు అమిత్ గౌడ్,అంగడి బజార్ కు చెందిన కుమార స్వామి గౌడ్ తల్లి ప్రమీల, మేదరీ బస్తీకి చెందిన ఏకుల సత్యనారాయణ మామ కొంటు రాజనర్సు, దొరల బంగ్లా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు మహ్మద్ పాషా, భీమారం మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ నరహరి సంతోష ఇటీవల పలు కారణాలతో మృతి చెందారు.
కాగా వారి కుటుంబాలను మంత్రి కలిసి పరామర్శించారు. మందమర్రి పట్టణం దీపక్ నగర్ లో ఇటీవల అగ్ని ప్రమాదంలో తంగళ్లపల్లి భాగ్య లక్ష్మి ఇల్లు దగ్ధం కాగా బాధితురాలిని పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
