కోల్‌బెల్ట్,వెలుగు: ప్రజాసంక్షేమానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రిలోని బీ1 ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో 125 మంది లబ్దిదారులకు రూ.1,25,14,500 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. మంత్రి వెంట మందమర్రి తహసీల్దార్ సతీశ్‌కుమార్,స్థానిక కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్‌కు చెందిన పాలరాజయ్య నూతన గృహాన్ని మంత్రి సందర్శించారు.
అనంతరం ఇటీవల అనారోగ్యంతో చిర్రకుంట మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఓడ్నాల కొమురయ్య,క్యాతనపల్లి మున్సిపాలిటీలో నాగార్జున కాలనీకి చెందిన కాంగ్రెస్ మహిళ లీడర్ సృజన తల్లి తార మృతిచెందగా బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు.ఆపరేషన్ చేసుకున్న ఐఎన్టీయూసీ సీనియర్ లీడర్ యమహా శ్రీనివాస్ కలిసిన మంత్రి ఆయన ఆరోగ్య,యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు.

