V6 News

రోడ్డు భద్రతతోనే ప్రమాదాల నివారణ : మంత్రి వివేక్ వెంకట స్వామి

రోడ్డు భద్రతతోనే ప్రమాదాల నివారణ :  మంత్రి వివేక్ వెంకట స్వామి
  •     మంత్రి వివేక్​వెంకటస్వామి 

కోల్​బెల్ట్, వెలుగు: రోడ్డు భద్రత అవగాహనతోనే ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి వాహనదారుడు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూరులో వేర్వేరుగా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి, జైపూర్​ఏసీపీలు కిరణ్​కుమార్, వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీఐలు పర్స రమేశ్, నవీన్​కుమార్, బన్సీలాల్, కృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు.

మంత్రికి వినతులు

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు వినతిపత్రాలు అందించారు. మందమర్రిలో విద్యుత్​ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్లు, మందమర్రి ఏరియా సింగరేణిలో కొత్త టెండర్​ పిలిచి తమకు ఉపాధి కల్పించాలని 213 మంది సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు మంత్రిని కోరారు. సింగరేణి హైస్కూల్​లో సెల్​టవర్​ఏర్పాటును ఆపాలని వాకర్స్​అసోసియేషన్​సభ్యులు విన్నవించారు.