బొక్కలగుట్ట అంటే నాకిష్టం.. ఇక్కడి నుంచే జర్నీ స్టార్ట్: మంత్రి వివేక్

బొక్కలగుట్ట అంటే నాకిష్టం.. ఇక్కడి నుంచే జర్నీ స్టార్ట్: మంత్రి వివేక్

మంచిర్యాల: బొక్కలగుట్ట గ్రామం అంటే నాకు చాలా ఇష్టమని.. ఇక్కడి నుంచే నా ప్రయాణం మొదలు అయ్యిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బొక్కలగుట్ట గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి హోదాలో ఆదివారం (జూలై 20) తొలిసారి మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి వెళ్లారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా వివేక్‎కు ఘనస్వాగతం పలికారు గ్రామస్తులు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా బొక్కలగుట్ట గ్రామంలో ఘనంగా  బోనాలు జరపడం సంతోషంగా ఉందన్నారు. అందరికీ ముందస్తుగా బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. గాంధారి మైసమ్మ ఆలయానికి ప్రత్యేకంగా రోడ్డు లైటింగ్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. చెన్నూరులో రెండు సబ్ స్టేషన్లు తీసుకువచ్చాను.. త్వరలో మరో మూడు తీసుకువస్తానని మాటిచ్చారు. 

చెన్నూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తొలగిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో ప్రజల సంతోషంగా ఉన్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ఖాజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన పేదలకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.