మీ అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటం

మీ అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటం

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణలో విద్యుత్ సంస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ కార్మిక విభాగంలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం విలీనం అయ్యింది. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కొత్తగా 9 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. వెట్టిచాకిరి వ్యవస్థ లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్  ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ  వెలుగును దేశవ్యాప్తం చేసిన మీ అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని పిలిచే నమ్మకాన్ని విద్యుత్ శాఖ కల్పించిందన్నారు.