టేకాఫ్కు రెడీ అయిన విమానం.. తేనెటీగల దాడితో గంట పాటు రన్ వే పైనే !

టేకాఫ్కు రెడీ అయిన విమానం.. తేనెటీగల దాడితో గంట పాటు రన్ వే పైనే !

తేనెటీగలు దాడి చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్షల ఈగలు ఒక్కసారిగి గుంపులు గుంపులుగా వచ్చి మీదపడిపోతే కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం. అయితే తేనెటీగలు మనుషులనే కాదు.. విమానాలపైన కూడా దాడి చేస్తున్నాయి. మంగళవారం (జులై 08) తేనెటీగల గుంపు దాడి చేయడంతో ఏకంగా విమానం ప్రయాణాన్నే వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 

సూరత్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానం టేకాఫ్ కు రెడీ అయ్యింది. సాయత్రం సరిగ్గా 4.20 గంటల ప్రాంతంలో రన్ వే మీద ఉన్న విమానంపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి చేసింది. దీంతో ఫ్లైట్ ను ఆపివేయడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఆందోళనకు గురయ్యారు. 

సూరత్ ఎయిర్ పోర్ట్ లో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు తెలిపారు. ప్యాసెంజర్లతో రెడీగా ఉన్న ప్లేన్ పై తేనెటీగలు వాలటంతో ఆగిపోవడం ఇదే తొలిసారి అని తెలిపారు. 

లగేజ్ సెక్షన్ పై దాడి చేసిన తేనెటీగలు:

ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘ఇండిగో 6E-7285  ఫ్లైట్ లోకి అప్పటికే ప్యాసెంజర్లు ఎక్కారు.. కార్గోలోకి లగేజ్ లోడ్ చేస్తున్న టైంలో లగేజ్ డోర్ పైన తేనెటీగలు సడెన్ గా వాలిపోయాయి. అయితే తేనెటీగలను వెళ్లగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. పొగ పెట్టినా ఈగలు వెళ్లకుండా ఫ్లైట్ ను పట్టుకుని ఉన్నాయి. చివరికి వాటర్ స్ప్రే చేసి వాటిని చెదరగొట్టాల్సి వచ్చింది’’ అని తెలిపారు. 

ALSO READ : బెంగళూరులో ఆటో ఛార్జీల పరేషాన్: మీటర్‌లో రూ.39 కానీ యాప్‌లో రూ.172.. వైరల్ పోస్ట్..

ఫ్లైట్ వాస్తవానికి 4.20 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. కానీ తేనెటీగలను చెదరగొట్టే వరకు ఒక గంట సమయం పట్టింది. చివరికి 5.26 గంటలకు ప్లేన్ స్టార్ట్ అయ్యింది. ఈ గ్యాప్ లో ప్యాసెంజర్లు ట్రైన్ లోనే ఉండిపోయారు. అయితే ఇది మొదటి సారి అయిప్పటికీ.. ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఒక వేకప్ కాల్ లాగా చూస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇక నుంచి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.