బెంగళూరులో ఆటో ఛార్జీల పరేషాన్: మీటర్‌లో రూ.39 కానీ యాప్‌లో రూ.172.. వైరల్ పోస్ట్..

 బెంగళూరులో ఆటో ఛార్జీల పరేషాన్: మీటర్‌లో రూ.39 కానీ యాప్‌లో రూ.172.. వైరల్ పోస్ట్..

ఈ వర్షాకాలంలో బయటికి వెళ్లాలంటే కార్ ఉండాల్సిందే. కానీ కార్ లేని వారు ఆటోలో వెళ్తుంటారు. అయితే ఇప్పుడు అంత స్మార్ట్'గా మారిపోయింది. కాబట్టి ఏదైనా ఇలా ఈజీగా ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చు. కానీ దీనికి సంబంధించి ఓ ఫోటోలు పెద్ద దుమారమే లేపుతుంది.    

బెంగళూరులో ప్రస్తుతం ఆటో చార్జీలు vs బైక్ ట్యాక్సీ ధరలు, ఇదే హాట్ టాపిక్. ఎందుకంటే బెంగళూరు సిటీలో ఆటో ఛార్జీలతో పోల్చితే బైక్ టాక్సీ యాప్స్ ధరలు ఎంత దారుణంగా ఉన్నాయో చెబుతూ ఓ మహిళ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ మారుతుంది.

అదితి శ్రీవాస్తవ అనే మహిళా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో చూసి అందరూ ఆశ్చయపోతున్నారు. ఎందుకంటే 2.6 కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించిన ఆమె మీటర్‌లో చూస్తే రూ.39 మాత్రమే చూపించింది. కానీ, అదే దూరానికి ఆన్‌లైన్ బుకింగ్ యాప్‌లో చూస్తే ఏకంగా రూ.172.45 చూపిస్తుంది. అంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ధర చూపిస్తుంది !

"మీటర్ ధర వర్సెస్ ఉబర్ ధర. బెంగళూరులో మీకు సొంత వాహనం లేకపోతే మీరు కచ్చితంగా చిక్కుల్లో పడినట్టే" అంటూ ఆమె ట్వీట్ చేసింది.

 

The price on meter vs the price on uber

If you don’t have your own vehicle in Bangalore, you’re screwed pic.twitter.com/2OYlhxuckq

— Aditi Srivastava (@adviosa) July 6, 2025

ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అయితే బెంగళూరులో రోజూ ప్రయాణించే వారికి ఇది కొత్తేమీ కాకపోవచ్చు. కానీ బైక్ టాక్సీలు సరిగా దొరకవు, యాప్స్  ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాదు. చాలా మంది నెటిజన్లు ఈ బైక్ టాక్సీ యాప్ ఛార్జీలను దోపిడీ, మోసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఛార్జీల వ్యవస్థ సామాన్యుడికి కాస్త అందుబాటులో ఉండేలా ఉండాలని కోరుతున్నారు. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ వల్ల సొంత వాహనం ఉన్నా కూడా చాలా ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.

ఒక నెటిజన్ "నిజమే...ఆ యాప్స్ ఒక స్కామ్. నిజానికి ఓలా, ఊబర్ ఆటో రైడ్స్ ని ఎవరూ బుక్ చేసుకోరు. కానీ రాపిడో, నమ్మ యాత్రి మాత్రమే" అంటూ ట్వీట్'కి రిప్లయ్ చేసారు. 

ALSO READ : నిమిషాల్లో రూ.925 కోట్లు కోల్పోయిన రేఖా జున్‌జున్‌వాలా.. ఏ స్టాక్ వల్ల అంటే..?

మరొకరు ఉబర్ ధరలు డిమాండ్‌ని బట్టి ఉంటాయి, కానీ మీటర్ ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని అనగా ఇంకొకరు ఉబర్ మీటర్ ఎంత ప్రయాణిస్తే దాదాపుగా అంతే చూపిస్తోంది. ఓలా, నమ్మ యాత్రి రైడ్‌లను వెరిఫై చేస్తాయి అని అన్నారు. అంతేకాకూండా చాల మంది దీని పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా బెంగళూరులో ఛార్జీల సమస్య ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.