
- బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పరకాల, వెలుగు : రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో గురుకులాల్లోని పిల్లల వైద్యానికి రూ.30వేలు ఖర్చుపెట్టలేరా.. అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ ఐపీఎస్ఆర్.ఎస్ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. ఇటీవల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఉరేసుకుని చనిపోయిన విద్యార్థిని ఏకు శ్రీవాణి సంతాపసభను సోమవారం హనుమకొండ జిల్లా పరకాలలోని స్వర్ణ గార్డెన్స్‌లో స్వేరోస్ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. గురుకులాల్లోని పిల్లలకు కోడింగ్ భాష నేర్పించేందుకు కేసీఆర్ తన హయంలో భువనగిరిలో ప్రత్యేక గురుకులాన్ని నెలకొల్పితే.. దాన్ని రేవంత్సర్కారు మూసేసిందని ఆరోపించారు.
వారంలో ముగ్గురు గురుకుల స్కూళ్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా పరామర్శించలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు దృష్టిలో సామాజిక న్యాయం అంటే చదువుకునే బిడ్డలను చంపడమా..? అని ఆయన ప్రశ్నించారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని ప్రభుత్వం తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తోందని, ఆ విషయాన్ని సీబీఐో, సీఐడీ, ఈడీ కో ఎందుకు అప్పగించడంలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ నేత ఏనుగు రాకేశ్ రెడ్డి, పీపీఎల్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, శ్రీవాణి కుటుంబ సభ్యులు, స్వేరోలు పాల్గొన్నారు.