విజయవాడ కనకదుర్గమ్మకు ఎంత బంగారం ఉందో.. ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారో తెలుసా.. ?

విజయవాడ కనకదుర్గమ్మకు ఎంత బంగారం ఉందో.. ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారో తెలుసా.. ?

ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవుడి హుండీలో ఎంతోకొంత డబ్బులు వేస్తుంటారు భక్తులు. ఇంకొంతమంది భక్తులు బంగారం, వెండి నగల రూపంలో కూడా కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు.అలా భక్తుల నుంచి వచ్చిన కానుకలతో ప్రపంచంలోనే ధనిక ఆలయాల్లో ఒకటిగా మారింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల తర్వాత ఏపీలో అంతటి ప్రాముఖ్యత ఉన్న దేవస్థానం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం. మరి, విజయవాడ కాకదుర్గమ్మకు ఎన్ని కేజీల బంగారం ఉందో.. అది ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బ్యాంకులో డిపాజిట్‌ చేసిన ఈ బంగారం విలువ.. గ్రాము రూ.9 వేల 10 రూపాయల రేటు చొప్పున దాదాపు రూ.27 కోట్లు ఉంటుందని... దుర్గమ్మ ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పల్లంరాజు, పర్యవేక్షకుడు సుబ్రహ్మణ్యం, నగల నిర్ధారణ అధికారి, ఆలయ ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్‌బాబు తదితరుల సమక్షంలో బంగారాన్ని బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. 

ALSO READ : టేకాఫ్కు రెడీ అయిన విమానం.. తేనెటీగల దాడితో గంట పాటు రన్ వే పైనే !

సోమవారం నాటి ఆన్ లైన్ రేట్ల ప్రకారం అమ్మవారి బంగారాన్ని విలువకట్టి బ్యాంకులో అప్పగించినట్లు  తెలిపారు అధికారులు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమ్మవారి బంగారాన్ని బ్యాంకులో అప్పగించినట్లు తెలిపారు అధికారులు.