Jan Shinwari: 41 ఏళ్ళ వయసులో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మరణం

Jan Shinwari: 41 ఏళ్ళ వయసులో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మరణం

అంతర్జాతీయ క్రికెట్ లో విషాదకర వార్త. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఇంటర్నేషనల్ క్రికెట్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారీ మరణించారు.   చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. 34 వన్డేలు, 26 టీ 20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన బిస్మిల్లా జాన్ షిన్వారీ కేవలం 41 సంవత్సరాల వయసులో మరణించడం బాధాకరం. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నుంచి సీనియర్ అంపైర్లలో బిస్మిల్లా జాన్ షిన్వారీ ఒకరు.   

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సంతాపం:

ఆఫ్ఘనిస్తాన్ ఎలైట్ అంపైరింగ్ ప్యానెల్‌లో గౌరవనీయ సభ్యురాలు బిస్మిల్లా జాన్ షిన్వారీ (1984 - 2025) మరణంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు  తీవ్ర దిగ్భ్రాంతికి మరియు బాధకు లోనైంది. శ్రీ షిన్వారీ అనారోగ్యంతో మరణించారనే వార్త మమ్మల్ని చాలా బాధ కలిగించింది". అని ఆఫ్ఘన్ బోర్డు తమ సంతాపం ప్రకటించింది. బిస్మిల్లా జాన్ ఆఫ్ఘన్ క్రికెట్‌కు గొప్ప అంపైర్లలో ఒకరు. అతను తన అత్యుత్తమ కెరీర్‌లో 34 వన్డేలు.. 26 టీ20లు, 31 ఫస్ట్-క్లాస్, 51 లిస్ట్ ఏ.. 96 డొమెస్టిక్ టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా పనిచేశాడు.
 
"అఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మొత్తం అఫ్ఘన్ క్రికెట్ సోదరభావానికి తన హృదయపూర్వక సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతనికి జన్నాలో అత్యున్నత పదవులను ప్రసాదించాలని.. ఈ క్లిష్ట సమయంలో అతనికి ఇష్టమైన వారికి సహనం, శక్తిని ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. బిస్మిల్లా జాన్ షిన్వారీ ఎల్లప్పుడూ మన హృదయాలలో ఆలోచనలలో నిలిచి ఉంటారు". అని బోర్డు తెలిపింది..

ALSO READ Wimbledon 2025: జొకోవిచ్ మ్యాచ్‌కు హాజరైన కోహ్లీ.. టెన్నిస్ దిగ్గజానికి విరాట్ స్పెషల్ ట్వీట్