రాష్ట్రాన్ని సంక్షేమానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి: మంత్రులు రాజనర్సింహ, కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు

రాష్ట్రాన్ని సంక్షేమానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి: మంత్రులు రాజనర్సింహ, కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు

ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మాడ్గులలో రూ.12.70 కోట్లతో 30 పడకల ఆసుపత్రి, కోనాపూర్ నుంచి మాడ్గుల, దేవరకొండ వరకు రూ.70 కోట్లతో డబుల్ లైన్ బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి,  జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 

తొలుత అంబేద్కర్, జ్యోతిబా పూలే, చాకలి ఐలమ్మ, జైపాల్ రెడ్డి విగ్రహాలకు వారు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడతూ.. రాష్ట్రాన్ని సంక్షేమానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొన్నారు.