రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్

రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్

సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌ దగ్గర రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు రంగనాయక సాగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. మోటార్ ఆన్‌ చేసి రంగనాయకసాగర్‌ జలాశయంలోకి గోదావరి జలాలు విడుదల చేశారు.

ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముందు చంద్లాపూర్‌లోని రంగనాయకస్వామి ఆలయంలో  మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సొరంగంలోని పంప్‌హౌజ్‌  దగ్గర పంప్‌ను ప్రారంభించారు. కరోనా వైరస్‌ కారణంగా లాక్ డౌన్  కొనసాగుతుండటంతో సాదాసీదాగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

2,300 ఎకరాల్లో రూ.3,300 కోట్ల ఖర్చుతో 3TMCల సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మించారు. జలాశయం ప్రారంభం కావడంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 1,14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.