కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉంది

కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉంది

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై పలువురు ప్రముఖులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అన్ని రంగాలకు సమప్రాధాన్యం ఇచ్చారని అభిప్రాయపడ్డారు. రైతులు, మహిళలు, యువతకు సంబంధించి కేంద్రం ప్రకటించిన నిర్ణయాలను మంత్రులు, ఎంపీలు ప్రశంసించారు.

రక్షణతో పాటు ఇతర రంగాలలో పరిశోధన, అభివృద్ధికి గణనీయమైన మొత్తాన్ని కేటాయించారు. ఆర్ అండ్ డీ బడ్జెట్లో 25శాతం స్టార్టప్లు, ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలన్న నిర్ణయం అద్భుతంగా ఉంది.- కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్  

వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. పర్వత ప్రాంత ప్రజలకు పర్వత్ మాలా ప్రాజెక్టు అద్బుతమైన బహుమతి. దీని ద్వారా ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. ఇంత మంచి బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు. - కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

బడ్జెట్ చాలా బాగుంది. పేదలు, గ్రామీణ, సరిహద్దు, ఈశాన్య ప్రాంతాల ప్రజలతో పాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేలా బడ్జెట్ ఉంది.-కేంద్రమంత్రి కిరణ్ రిజుజు

ఇది సామాన్యుల బడ్జెట్. మౌలిక సదుపాయాల్లో 35శాతం ఆర్థిక వ్యవస్థను వేగాన్ని పెంచుతుంది. దేశంలో తయారీకి బూస్టర్ షాట్ వంటింది. దేశానికి చెందిన డబ్బును దేశంలోనే ఉంచుతుంది.- బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రగతిశీలమైనది. రైతులు, మహిళలు, యువతతో పాటు అన్ని వర్గాలకు లాభం చేకూర్చుతుంది. మద్దతు ధరపై చేసిన ప్రకటన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. యువతకు 60లక్షల ఉద్యోగాలు, మహిళా సాధికారిత కోసం మిషన్ శక్తి తదితర చర్యలు ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి.- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్