కాకతీయ వారసుడికి ఘన స్వాగతం

కాకతీయ వారసుడికి ఘన స్వాగతం

వరంగల్‌: కాకతీయ వారసుడు ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టాడు. కాకతీయుల 22వ తరం వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ వరంగల్కు చేరుకున్నారు. భద్రకాళి ఆలయం వద్ద ఆయనకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం భద్రకాళి ఆలయంలో భంజ్ దేవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ప్రభుత్వం వారం రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకలను కమల్ చంద్ర భంజ్ దేవ్ ప్రారంభించనున్నారు.

ఈ నెల 13 వరకు కాకతీయ ఉత్సవాలు జరుగనున్నాయి. కాకతీయుల పాలనా వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాకతీయుల చరిత్ర, కోటలు,  సామ్రాజ్య విస్తరణ, వాడిన పరికరాలతో పాటు ఇతర విశేషాలు ప్రజలకు అర్ధమయ్యేలా వివరించనున్నారు. ప్రజలను ఉత్తేజ పరిచేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పబ్లిక్ గార్డెన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.