
- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
పరిగి, వెలుగు: స్టూడెంట్ల భవిష్యత్తును తాము బాధ్యతగా తీసుకుని విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని తుంకులగడ్డలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దుతోందన్నారు.
అనంతరం దోమ మండల కేంద్రంలో రేషన్‌కార్డుల పంపిణీ, మహిళా శక్తి సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. మోత్కూర్‌లో రూ.60 లక్షలతో నిర్మించనున్న మల్టీ పర్పస్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, డీఈవో రేణుకాదేవి, ఆర్డీవో వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.