రెండు రాష్ట్రాలకు అప్పుల లిమిట్ పెంచిన కేంద్రం

రెండు రాష్ట్రాలకు అప్పుల లిమిట్ పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు గానూ మరో రెండు రాష్ట్రాలకు అదనపు అప్పులు పొందేందుకు అనుమతి ఇచ్చింది. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.7,309 కోట్ల అదనపు అప్పులు తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో ఏపీకి రూ.2,123 కోట్లు, రాజస్థాన్‌కు రూ.5,186 కోట్లు అదనపు అప్పుల పరిమితి పెంచుతున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో ఈ పరిమితి పెంపు ఆ రాష్ట్రాలకు శుభవార్త లాంటిదేనని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. కాగా, ఇప్పటికే 11 రాష్ట్రాలు విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు అదనపు అప్పులను తీసుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను అమలు చేసినందుకు ప్రోత్సాహకంగా ఈ అప్పుల పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తల  కోసం..

బ్రహ్మోస్‌ మిస్సైల్ ఎగుమతికి భారత్‌కు తొలి ఆర్డర్

ఎన్సీసీ పరేడ్‌లో ప్రధాని మోడీ న్యూ లుక్

సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మితే రైతులకు బెనిఫిట్