V6 News

 హనుమకొండ జిల్లాలో దళిత, దివ్యాంగ బాలికపై లైంగిక దాడి ?

 హనుమకొండ జిల్లాలో దళిత, దివ్యాంగ బాలికపై లైంగిక దాడి ?
  •  హనుమకొండ జిల్లాలో ఘటన

భీమదేవరపల్లి, వెలుగు : దళిక, దివ్యాంగ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి ఓ యువకుడితో పాటు అతడి ఫ్రెండ్స్‌‌ లైంగికదాడికి పాల్పడ్డారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 11న జరిగిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి బాలికను మల్లారం గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించాడు.

శనివారం రాత్రి గ్రామ శివారులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో అతడితో పాటు వచ్చిన మరో ఇద్దరు సైతం బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలిసింది. అనంతరం ఇంటికి చేరుకున్న బాలిక విషయాన్ని తల్లికి చెప్పగా.. ఆమె గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో బయటకు పొక్కకుండా పంచాయితీ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

గ్రామ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండడంతో బాలిక, తన తల్లితో కలిసి సోమవారం ముల్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను హనుమకొండలోని భరోసా కేంద్రానికి తరలించి, బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై రాజు
 తెలిపారు.