వికారాబాద్‎లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదు

వికారాబాద్‎లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదు

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకవైపు కుండపోత వర్షాలు అల్లకల్లోలం చేస్తున్న సమయంలో భూమి కంపించడంతో ఎటు పరుగులు తీయాలో అర్థంకా ప్రజలు ఆందోళన చెందారు. పరిగి పరిసర ప్రాంతాల్లో భూమిని సుమారు 3 సెకన్ల పాటు కంపించింది. రంగాపూర్, బసిపల్లి, న్యామత్‌నగర్‌లో భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్ర రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది.