మైనారిటీ గురుకులాల్లో కొత్త టైం టేబుల్

మైనారిటీ గురుకులాల్లో కొత్త టైం టేబుల్
  • గురుకుల సొసైటీ సెక్రటరీ ఉత్తర్వులు
  • స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్​  స్కూల్స్, కాలేజీల్లో కొత్త టైం టేబుల్​ తెచ్చారు. పబ్లిక్​ హాలిడేస్, ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ టైం టేబుల్​ పాటించాల్సిందిగా ఆయా స్కూల్స్, కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ మైనారిటీ శాఖ సెక్రటరీ షఫి ఉల్లా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త టైం టేబుల్​ను ప్రీ క్లాస్ రూం, క్లాస్ రూం, పోస్ట్​ క్లాస్​ రూం​ యాక్టివిటీస్​గా విభజించారు. 

కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 205 మైనారిటీ గురుకులాల్లో తీసుకొచ్చిన కొత్త టైం టేబుల్​ను స్వాగతిస్తున్నామని  తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్​   అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్.అజయ్​కుమార్,​ పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, భిక్షం గౌడ్  తెలిపారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్​ రెడ్డి విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్​ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ కొత్త టైం టేబుల్​ తీసుకొచ్చారని, ఈ సందర్భంగా వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు వెల్లడించారు.