ఆకాశంలో అద్భుతం.. ఒకే కక్షలో ఐదు గ్రహాలు

ఆకాశంలో అద్భుతం.. ఒకే కక్షలో ఐదు గ్రహాలు

ఇవాళ (మార్చి 27) ఆకాశంలో అద్భుతం కనిపించనుంది. సూర్యాస్తమయం తర్వాత గురు, బుధుడు, శుక్రుడు, మార్స్, యురేనస్ గ్రహాలు ఒకే కక్షలో కనిపించనున్నాయి. హారిజోన్ పైన ఆర్క్ ఆకారంలో దర్శనమిస్తాయి. 

అయితే, కొన్ని దేశాల్లోని ప్రజలకు మాత్రమే వీటిని చూసే అవకాశం దక్కుతుందని, సిటీల్లో నివసించే వాళ్లకి ఇవి కనిపించకపోవచ్చని ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మెస్సియర్ అన్నారు. సిటీలకు దూరంగా అడవి ప్రాంతాల్లో బైనాకులర్ లేదా టెలిస్కోప్  సాయంతో వీటిని చూడొచ్చని తెలిపారు. 

ఆకాశంలో బృహస్పతి, మెర్క్యురీ పక్కపక్కనే కనిపిస్తాయి. శుక్రుడు పెద్దగా కనిపిస్తాడు. అయితే, సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక గంట సమయం వరకే ఇవి కనిపించనున్నాయి.