
సమ్మర్ కదా, ఏ ఫ్రూట్ మార్కెట్ కి వెళ్లినా పసుపు రంగులో మామిడి పళ్లు నిగనిగలాడుతూ నోరూరిస్తుంటాయి. వాటితోపాటు అరటి, జామ, యాపిల్, బొప్పాయి.. ఇలా రకరకాల పండ్లన్నీ మిలమిలా మెరుస్తూ ఆకట్టుకుంటాయి. అంతలా కంటికి ఇంపుగా కనిపిస్తుంటే వెంటనే వాటిని కొనుక్కుని తినేయాలనిపిస్తుంది. అయితే పైకి అలా ఆకర్షణీయంగా కనిపించే పండ్లన్నీ నిజంగా చెట్టుకి మగ్గినవి కావనీ, అవన్నీ రసాయనాల పూరితమని, ఫ్రూట్స్ తో పాటే రసాయనాలను కూడా మింగేస్తున్నారు. మరి సహజంగా పండిన పండ్లను.. కృత్రిమంగా పండించిన పండ్లను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. . .
సమ్మర్ సీజన్ లో రోడ్డుపైకి వస్తే చాలు మామిడి పండ్లు అమ్మడానికి సిద్దంగా ఉంటాయి. చాలా మంది ఊళ్లో తోటల్లోనుంచి తెచ్చుకుంటారు.. వాటి రుచికి.. సిటీలో కొన్న పండ్లకు టేస్ట్ చాలా తేడా ఉంటుంది. అంటే సిటీలో పండ్లను కృత్రిమంగా రసాయనాలతో పండిచారన్నమాట.. ఇంకోటి అరటి పండ్లు ఏడాది పొడవునా దొరుకుతాయి. వీటిని కూడా రసాయనాలతో మగ్గేస్తుంటారు. ఇలా కృత్రిమంగా పండించిన పండ్లను తింటే పోషకాల మాట ఎట్టున్నా.. రోగాలు మాత్రం కాయమంటున్నారు వైద్యులు..
మార్కెట్లో దొరికే ప్రతీ ఫ్రూటికి ఒక సీజన్ ఉంటుంది. అవి ఆ సీజన్ లోనే ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే సీజన్ తో సంబంధం లేకుండా కొన్ని పండ్లు సంవత్సరం పొడవునా లభిస్తుంటాయి. అలాంటివన్నీ కృత్రిమంగా రసాయనాల ద్వారా పండించినవే. వేసవికాలంలో మామిడి పండ్లతో పాటు చాలారకాల పండ్లలో... రైపనింగ్ ఏజెంట్స్ ....వినియోగం ఎక్కువగా ఉంటుంది. రైపనింగ్ ఏజెంట్స్ అంటే క్యాల్షియం కార్బైడ్ ..ఇథిలీన్ లాంటి రసాయనాలు. వీటిని ఉపయోగించి పండ్లకు కృత్రిమంగా రంగు తెప్పించి పండిస్తుంటారు.
ALSO READ : Summer Drinks : ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ బదులు వీటిని తాగండి.. ఆరోగ్యమే కాదు.. ఎనర్జీ కూడా..!
పండ్లు నున్నగా మెరుస్తూ కనపడేందుకు ఫ్రూట్స్పై కోటింగ్ వేస్తారు. ముఖ్యంగా మామిడి.. అరటి..యాపిల్స్ లో దీని కోసం వ్యాక్స్ ను వాడతారు. వ్యాక్స్ అనేది పెట్రోలియం ప్రాడక్ట్ ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా పండ్లు, కూరగాయలు పండించేటప్పుడు కొన్ని ఎరువులు, రసాయనాలు వాడటం సహజం. ఇవి కూడా పండ్ల పై పొరలో ఉండి పోతాయి. వీటిని నేరుగా తీసుకోవడం ద్వారా కూడా శరీరంలోకి కూడా రసాయనాలు వెళ్లిపోతాయి.
నష్టాలు ఇవీ..
- రసాయనాలను కలిపిన పండ్లను తింటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- రసాయనాలు వేసి పండించిన పండ్లను తింటే.. వాటిలో ఉండే పోషక విలువలు దెబ్బ తింటాయి. కాబట్టి వాటిని తిన్నా పెద్ద ప్రయోజనం ఉండదు. దీనికి తోడు విష పదార్థాలు శరీరంలోకి చేరి అనేక రకాల అనారోగ్యాలకు కారణం అవుతాయి.
- వాంతులు, విరేచనాలు, డయేరియా సమస్యలు వస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. చర్మంపై దురదలు, దద్దురు వస్తాయి. విపరీతమైన దాహం చేస్తుంది.. నోరు.. ముక్కు.. గొంతు ఇన్ఫెక్షన్లు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత... చర్మ..జుట్టు సమస్యలు...బ్రెయిన్.. కిడ్నీ.. లివర్ సమస్యలు కూడా రావొచ్చు. ఒక్కోసారి వీటి ప్రభావం క్యాన్సర్ కు కూడా దారి తీసే ప్రమాదముంది.
గుర్తు పట్టడం చాలా ఈజీ
- పండ్లు కొనేటప్పుడు మోసపోకూడదంటే ... ఏ సీజన్లో దొరికే పండే ఆ సీజన్లలోనే కొనాలి . సీజనుకు ముందే మార్కెట్ లోకి వచ్చిన పండ్లను కొనడం అంతమంచిది కాదు. మే చివరి నుంచి జులై వరకు మామిడి పండ్లకు అసలైన సీజన్. అప్పుడే మార్కెట్లోకి సహజంగా మగ్గిన పండ్లు వస్తాయి. అలా కాకుండా. సీజన్ కంటే ముందు వచ్చే పండ్లు కృత్రిమంగా పండించినవే.
- మామిడి పండ్లు కొన్నాక మంచివా, కల్తీనా అని గుర్తించాలంటే పండ్లను బకెట్ నీళ్లలో వేసి చూడాలి. మామిడి పండు నీళ్లలో మునిగితే పండు సహజంగా పండినట్టు... ఒకవేళ నీళ్లలో తేలితే కృత్రిమంగా పండించారని అర్ధం.
- మార్కెట్ లో పండ్ల రంగు చూసి మోసపోకూడదు. పళ్లన్నీ ఒకేరకంగా, ఒకే రంగులో ఉన్నా, తొక్కమీద నల్లటి మచ్చలున్నా అవి కృత్రిమంగా మగ్గినవేనని అర్థం చేసుకోవచ్చు.
- కృత్రిమంగా పండించిన పండ్లన్నీ దాదాపుగా ఒకే రంగులో ఉంటాయి. రంగులో ఎలాంటి తేడా కనిపించదు. అదే సహజ సిద్ధంగా పండినవైతే రంగుల్లో తేడా ఉంటుంది. అన్ని పండ్లు ఒకే రంగులో ఉండవు. ఒకే జాతీ అయినప్పటికీ వేరువేరు రంగుల్లో ఉంటాయి.
- అరటి పండు తొడిమ ...గ్రీన్ కలర్ ఉండే పండు... పసుపు రంగులో ఉంటే ..అవి కృత్రిమంగా పండించినవే. సహజ సిద్ధంగా పండినవయితే ...తొడిమ కూడా పనుపు రంగులోనే ఉంటుంది.
- సహజ సిద్ధంగా పండిన కూరగాయలు, పండ్లు ఆకర్షణీయంగా ఉండవు ..కానీ కృత్రిమంగా పండినవాటి రంగు మెరుస్తుంటుంది. ఆ రంగును బట్టి గుర్తుపట్టేయొచ్చు.
- కృత్రిమంగా పండిన పండ్లు మెత్తగా.. మృదువుగా ఉంటాయి. సహజ సిద్ధంగా పండినవి కొంచెం గట్టిగా ఉంటాయి. రంగును చూసి మోసపోకుండా కాయను సున్నితంగా నొక్కి తొడిమల దగ్గర మంచి వాసన వస్తుందా అని చూడాలి..
ఇలా చేయాలి
- మనం తినే పండ్లు, కూరగాయల మీద ఉండే రసాయనాలు, క్రిములను పూర్తిగా, పోయేలా శుభ్రం చేయడానికి కొన్ని పద్దతులున్నాయి.
- కూరగాయలను గోరు వెచ్చని నీళ్లలోవేసి కడగడం వల్ల వాటిపై ఉండే రసాయనాలు పోతాయి. చల్లని నీళ్లతో కడిగినట్లయితే స్క్రబ్బర్ వాడాలి. దాంతో కూరగాయలను బాగా రుద్దాలి అలా చేస్తేనే వాటిపై ఉండే రసాయనాలు వదులుతాయి.
- పండ్లు, కూరగాయల మీద చేరిన ఫెస్టిసైడ్స్ ను ప్రభావవంతంగా తగ్గించడంలో బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. ఒక బకెట్ లో నీళ్లు నింపి, అందులో ఒక నాలుగు చెంచాల బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. ఈనీళ్లలో పండ్లు, కూరగాయలు వేసి పావుగంట తర్వాత శుభ్రం చేసి తిరిగి మంచి నీళ్లతో కడిగి ఉపయోగించుకోవాలి.
- పండ్లు, కూరగాయల మీద చేరిన క్రిములను, బ్యాక్టీరియాను వెనిగర్ కూడా నాశనం చేస్తుంది. ఒక బకెట్లో కొద్దిగా నీళ్లు నింపి అందులో వైట్ వెనిగర్ ఒక కప్పు వేసుకోవాలి. ఆ నీళ్లలో ఐదు నిముషాలు పండ్లు, కూరగాయలు వేయడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు నాశనం అవుతాయి.
- స్ప్రే.. సీసాలో ఒక చెంచా నిమ్మరసం... రెండు చెంచాల వెనిగర్... ఒక కప్పు నీళ్లు కలుపుకొని ఇంట్లోనే వెజిటబుల్ స్ప్రే తయారుచేసుకోవచ్చు. దీన్ని పండు లేదా కూరగాయల మీద చల్లి బలంగా రుద్ది తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే చాలు.
- పండ్లపై రసాయనాలు పై పొరల్లో పేరుకుని ఉంటాయి. అందుకే మామిడి పళ్ళను తినేముందు వాటి తొక్కను తీసేయడం మంచిది. అలాగే ఉల్లిపాయల్ని కూడా పొట్టు తీశాక పైరెండు పొరలను తీసిమరీ వాడాలి. క్యాబేజీని కూడా ఇదే పద్ధతి ఉపయోగించి గుర్తించవచ్చు.