Summer Drinks : ఎండాకాలంలో కూల్ డ్రింక్స్​ బదులు వీటిని తాగండి.. ఆరోగ్యమే కాదు.. ఎనర్జీ కూడా..!

Summer Drinks : ఎండాకాలంలో కూల్ డ్రింక్స్​ బదులు వీటిని తాగండి.. ఆరోగ్యమే కాదు.. ఎనర్జీ కూడా..!

కొంచెం ఎండ అనిపించినా.. లేదా నలుగురు కలిసినా.. వెంటనే కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసి గటగట తాగేస్తారు.. ఇక ఇళ్లల్లో కూడా కూల్ డ్రింక్స్ నిల్వ ఉంచుకుని పిల్లలకు కూడా ఈ రుచిని చూపిస్తారు... కూల్​ డ్రింక్స్​  హానికరమే..అయినా ఎండకు గటగటా తాగేస్తారు. సమ్మర్​ లో కూల్​ డ్రింక్స్​ తాగాలనిపించినప్పుడు కొన్ని   సహజసిద్ధమైన పానీయాలను తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . 

Also Read : రోజూ టీ స్పూన్ గుమ్మడి గింజలు తింటే

  • క్యారెట్: ఇందులో  విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. 
  • కీరా: ఇందులో  నీటి శాతం అధికంగా ఉండటమే కాకుండా ..... కీరాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. సహజంగా బరువు తగ్గాలను కున్నా... చర్మం ఆరోగ్యంగా ఉం డాలనుకున్నా కీర దోస జ్యూస్ తాగడం మంచిది. ఇది త్వరగా జీర్ణం అవుతుంది కూడా. 
  • మామిడి రసం:  మామిడి తినకుండా, రసం తాగకుండా వేసవి పూర్తి కాదు. పచ్చి మామిడి రసం ఎండవల్ల చర్మం దెబ్బతినకుండా కాపా డుతుంది. 
  • నిమ్మరసం: ఇది  శరీరాన్ని, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా.. . అధిక బరువుని కూడా తగ్గిస్తుంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ జ్యూస్ పక్కాగా తీసుకోవాల్సిందే. 
  • పుదీనా రసం:  పుదీనా జ్యూస్ వేసవి వేడితో పోరాడి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. 
  • టొమాటో: వీటిలో విటమిన్-సీ...  యాంటీ ఆక్సి డెంట్లు పుష్కలంగా ఉంటాయి.  పోషక విలుకలు కూడా అధికం. అందుకే ఈ సీజన్ లో టొమాటో జ్యూస్ తాగితే మంచిది