
అమెరికాలోని ట్రంప్ సర్కార్ ప్రస్తుతం ఖతార్ రాయల్ ఫ్యామిలీ అందిస్తున్న బోయింగ్ 747-8 ప్లేన్ బహుమతిని అంగీకరించాలని చూస్తోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ గడచిన 40 ఏళ్ల నుంచి సేవలను అందిస్తోంది. తాత్కాలికంగా దీని స్థానంలో ఖతార్ అందించే విమానాన్ని ట్రంప్ ఉపయోగించనున్నారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో ఏమూలకు ప్రయాణించాలనుకున్నా ఎయిర్ ఫోర్స్ వన్ నే వినియోగిస్తారని మనందరికీ తెలిసిందే. ఖతార్ అందిస్తున్న బహుమతిని అంగీకరిస్తే చరిత్రలో ఇదొక అతిపెద్ద గిఫ్ట్ గా మారుతుంది.
ఖతార్ అందించనున్న బోయింగ్ విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ స్థానంలో ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీని ఖరీదు అక్షరాలా రూ.3వేల 300 కోట్లు కావటం గమనార్హం. అయితే ట్రంప్ అందుకుంటున్న ఈ గిఫ్ట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కాకుండా ఆ తర్వాత కూడా ఆయన దానిని ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుందని ఇద్దరు అధికారులు వెల్లడించారు.
Also Read : అధంపూర్ ఎయిర్ బేస్కు ప్రధాని మోదీ
ప్రస్తుతం ట్రంప్ అందుకోనున్న ఖరీదైన విమానం ఎలాంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా రానుంది. అయితే దీనిని పూర్తిగా ట్రాన్పరెంట్ విధానంలో తీసుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. అయితే దీనికి డబ్బు చెల్లించేదుకు డెమోక్రాట్లు ముందుకు రాచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ గిఫ్ట్ విషయం ఇప్పటికీ చర్చల దశలో వైట్ హౌస్ వద్ద ఉందని, పూర్తిగా చట్టప్రకారమే దీనిని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడైంది.
అయితే అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తికి ఏకంగా 400 మిలియన్ డాలర్లు విలువైన విమానాన్ని బహుమతిగా ఇవ్వాలని ఖతార్ రాయల్ ఫ్యామిలీ ముందుకు రావటం అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొందరు దీనిని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ వద్ద తన సొంత ట్రంప్ ఫోర్స్ వన్ అనే బోయింగ్ 757 జెట్ ఉంది. దీనిని 2011లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ నుంచి ట్రంప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.