PM Modi Adampur Airbase: అధంపూర్ ఎయిర్ బేస్కు ప్రధాని మోదీ.. పాక్ దుష్ప్రచారానికి కౌంటర్.. నెట్టింట ఫొటోలు వైరల్..

PM Modi Adampur Airbase: అధంపూర్ ఎయిర్ బేస్కు ప్రధాని మోదీ.. పాక్ దుష్ప్రచారానికి కౌంటర్.. నెట్టింట ఫొటోలు వైరల్..

‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్కు భారత సైన్యం తగిన గుణపాఠం చెప్పడంతో సైనికులను నేరుగా కలిసి అభినందించేందుకు ప్రధాని మోదీ పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లారు. సైనికులను కలిసి అభినందించిన మోదీ వారితో ముచ్చటించారు. మంగళవారం ఉదయం అధంపూర్ ఎయిర్ బేస్కు చేరుకున్న ప్రధానికి ‘ఆపరేషన్ సిందూర్’ గురించి భారత వైమానిక దళ సైనికులు వివరించారు.

అధంపూర్ ఎయిర్ బేస్లో ప్రధాని మోదీ దాదాపు గంటన్నరకు పైగా గడిపారు. ‘ఆపరేషన్ సిందూర్’లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) చూపిన తెగువను ప్రధాని కొనియాడారు. త్రిశూలం ముద్రించిన టోపీని ధరించి మోదీ అధంపూర్ ఎయిర్ బేస్కు వెళ్లడం విశేషం.

పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్ పై దాడి చేశామని, ఎయిర్ బేస్ ధ్వంసమైందని పాక్ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారమేనని ప్రధాని మోదీ విజిట్తో తేలిపోయింది. దేశంలోనే రెండో అతిపెద్ద వైమానిక స్థావరం అధంపూర్ ఎయిర్ బేస్. ఉత్తర్ ప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ మన దేశంలోనే అతిపెద్ద వైమానిక స్థావరం.

Also Read : మోదీ అధ్యక్షతన హైలెవల్ భేటీలు

పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్ సందర్శించిన ప్రధాని మోదీ సైనికులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. మన దేశ సైనికులు చూపిస్తున్న ధైర్య సాహసాలకు, చేస్తున్న సేవకు ఇండియా ఎప్పటికీ రుణపడి ఉంటుందని మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. తెగువ చూపి ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేసిన సైనికులను కలుసుకోవడం తనకు ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చిందని ఆయన పోస్ట్ చేశారు.