
ఆస్కార్ విజేత, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ సాంగ్స్ ఎంత ఫేమస్ అనేది 90, 20's ఆడియన్స్కు తెలుసు. తాను ఉపయోగించే కీ బోర్డు, వోకల్స్ నుంచి మొదలు, పాడే సింగర్ మరియు లిరిక్ వరకు డిఫెరెంట్గా ఉంటాయి. అయితే, తాను కంపోజ్ చేసిన ఓ పాటపై అద్భుతమైన షాడో డ్యాన్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'జీన్స్' మూవీలోని పువ్వుల్లో దాగున్నా పాటకు.. చేసిన ఓ షాడో డ్యాన్స్ షో పైనే అందరి దృష్టి పడింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ షోబి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు.
Also Read : ఓజీ మేకర్స్ షాకింగ్ డెసిషన్
ఇందులో ఆయనతో పాటు ఓ మహిళా డ్యాన్సర్ కూడా పాల్గొన్నారు. వెలుతురు ప్రసరిస్తున్న ఓ కర్టెన్ వెనుక వీరిద్దరూ చేసిన ఈ షాడో డ్యాన్స్.. చాలా సెటిల్, అట్ట్రాక్టీవ్గా ఉంది. దానికితోడు వారు ఉపయోగించిన ప్రతి చిన్నది ఏంతో క్రియేటివిటీని చూపిస్తోంది. దాంతో ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 45 మిలియన్లకు పైగా (నాలుగున్నర కోట్లకు పైగా) వ్యూస్ సంపాదించి, నెటిజన్ల నుంచి బెస్ట్ కాంప్లీమెంట్స్ దక్కించుకుంటోంది.
అందులో క్రియేటివిటీ + ఎఫర్ట్ = అమేజింగ్ పెర్ఫార్మన్స్ అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. “చాలా చక్కగా మరియు అందంగా ఉంది” అంటూ మరికొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
పాట విశిష్టత:
శంకర్ డైరెక్టర్ చేసిన ఈ పాటకు వైరముత్తు సాహిత్యం అందించారు. ఇందులో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ మరియు ప్రశాంత్ నటించారు. పారిస్, రోమ్, న్యూయార్క్, ఈజిప్ట్, చైనా మరియు భారతదేశంతో సహా అనేక ప్రసిద్ధ ప్రపంచ ప్రదేశాలలో చిత్రీకరించారు. ఐశ్వర్య రాయ్ వివిధ యుగాల రాణుల వలె దుస్తులు ధరించి ఈ పాటలో కనిపిస్తుంది.
ఈ వీడియోను ప్రత్యేకంగా నిలబెట్టేంది చాలా తెలివైన డ్యూయల్-వ్యూ ఫార్మాట్. ఒక వైపు, ప్రేక్షకులు తెరవెనుక సెటప్‌ను చూస్తారు, మరొక వైపు అద్భుతమైన షాడో డ్యాన్స్ ప్రదర్శనను సైతం గమనిస్తారు. చాలా స్మూత్ హావభావాలు, ఖచ్చితమైన కదలికలు మరియు వారి క్రియేటివిటీ.. ఇలా దాదాపు నిమిషం నిడివి గల ఈ వీడియో ఒక దృశ్య కళాఖండం. మీరు కూడా చూసేయండి.. తప్పకుండా నచ్చేస్తుంది.