
అల్లు అర్జున్, అట్లీ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. AA22xA6వర్కింగ్ టైటిల్తో మూవీ తెరకెక్కుతోంది. ఈ కాంబినేషన్పై మేకర్స్ స్పెషల్ వీడియో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ అవుతున్నాయి.
యోధుడి పాత్రలో:
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో అల్లు అర్జున్ యోధుడి పాత్రలో కనిపించనున్నాడనే సమాచారం. తొలిసారి హాలీవుడ్ స్థాయిలో పార్లల్ యూనివర్స్లో అల్లు అర్జున్ యోధుడిగా కనిపిస్తారట. ఇప్పటివరకు పార్లర్ యూనివర్స్, ఏలియన్స్ లాంటి కాన్సెప్ట్ లో వచ్చిన సినిమాలన్నీ హాలీవుడ్ మేకర్స్ తీసినవే. ఇప్పుడు మన ఇండియాన్ మేకర్స్ తీస్తుండటం ఎంతో ఆసక్తి రేకేత్తిస్తోంది.
అంతేకాకుండా ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపిస్తాడని కూడా రూమర్ వినిపిస్తోంది. రెండు విభిన్నమైన లుక్స్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, బన్నీ డ్యూయల్ రోల్లో కనిపించడం మొదటిసారి అవుతుంది.
పార్లల్ యూనివర్స్:
"పార్లల్ యూనివర్స్" (Parallel Universe) అంటే.. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ విశ్వాలు ఉన్నాయని భావించే ఒక సిద్ధాంతం. ఇది మన స్వంత విశ్వానికి సమాంతరంగా ఉన్న మరొక విశ్వం (లేదా అనేక విశ్వాలు) ఉండొచ్చు అని సూచిస్తుంది. ఒక సైన్స్ ఫాంటసీ మూవీలో ఈ సిద్ధాంతం ప్రకారం.. ఎంచుకునే ప్రతి పాత్ర మరియు చేసే ప్రతి పని ఒక కొత్త విశ్వానికి దారి తీస్తుంది అని చెబుతుంది.
Sun Pictures 🤝 @alluarjun 🤝 @Atlee_dir
— Sun Pictures (@sunpictures) April 8, 2025
Crossing Borders. Building Worlds. 💥🔥#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥
🔗 - https://t.co/NROyA23k7g#AA22 #A6 #SunPictures pic.twitter.com/2Cr3FGJ9eM
షూటింగ్ అప్డేట్:
అల్లు అర్జున్ - అట్లీ మూవీ జూన్ నుంచి షూటింగ్ షురూ కానుందని సమాచారం. జూన్ మిడిల్లో అల్లు అర్జున్ వర్క్ షాప్లో పాల్గొనే ఛాన్స్ ఉందంట. అదేవిధంగా మాక్ షూటింగ్, రిహార్సల్స్ కూడా ఉంటాయట.
ALSO READ : OG Movie: ఓజీ మేకర్స్ షాకింగ్ డెసిషన్.. సడెన్గా సినిమాటోగ్రాఫర్ మార్పు.. కారణం ఇదే!
సన్ పిక్చర్స్‌కు చెందిన కళానిధి మారన్.. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో మూవీ తెరకెక్కిస్తున్నాడు. కనుకే డైరెక్టర్ అట్లీ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే షూటింగ్ కి ముందుగానే వర్క్ షాప్స్ నిర్వహించి, అన్నీ సవ్యంగా జరిగేలా ఆలోచిస్తున్నాడట. వచ్చే ఏడాదిలో (2026) ఈ మూవీని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారని టాక్.
సైన్స్ ఫిక్షన్ జానర్‌లో:
సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది రానుంది. ఈ మూవీని దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంచనా. అందులో రూ.200 కోట్ల నిర్మాణ వ్యయంతో పాటు రూ.250 కోట్ల VFX పనులకు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇక మిగతావి నటి నటుల రెమ్యునరేషన్. మొదటి సారి అల్లు అర్జున్-అట్లీల సైన్స్ ఫిక్షన్ కలయిక ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయనుందనే ఆసక్తి నెలకొంది. అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ కి పనిచేయబోయే టెక్నీషియన్స్ అండ్ నటీనటుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ రెమ్యునరేషన్:
ఇకపోతే, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.175 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లాభాలలో 15% వాటా కూడా తీసుకోనున్నాడట బన్నీ. అయితే అట్లీ కెరీర్‌లో 6వ సినిమాగా వస్తోన్న ఈ మూవీకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడట. వీరి భారీ మొత్తం చూస్తుంటే అట్లీ-ఐకాన్ల బ్రాండ్ ఏంటో అర్ధమవుతుంది.