కేసీఆర్ ​రోడ్ ​షోకు ముందే షాక్​బీఆర్ఎస్​కు మిర్యాలగూడ లీడర్ల రాజీనామా

కేసీఆర్ ​రోడ్ ​షోకు ముందే షాక్​బీఆర్ఎస్​కు మిర్యాలగూడ లీడర్ల రాజీనామా

 

  •      మున్సిపల్​ మాజీ చైర్మన్,కౌన్సిలర్, మరికొందరు లీడర్లు..
  •        రఘువీర్​రెడ్డిని గెలిపిస్తామని ప్రకటన

మిర్యాలగూడ, వెలుగు : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్​షో ఈ నెల 24న మిర్యాలగూడలో నిర్వహించనున్న నేపథ్యంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు మిర్యాలగూడ మున్సిపల్ ​మాజీ చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్, మరికొందరు పార్టీ లీడర్లు ​ప్రకటించారు. ​సోమవారం మీడియా సమావేశంలో మిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ గార్లపాటి నిరంజన్ రెడ్డి,  25వ వార్డు కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి, మిర్యాలగూడ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ బీఆర్ఎస్ జిల్లా సీనియర్ లీడర్ ​ఎండీ మదర్ బాబా రిజైన్ ​చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని చేరికలుంటాయన్నారు. నీటి సంఘాల మాజీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి, మునీర్, గౌస్ ఖాన్, తులసి, జావేద్ ఉన్నారు.