‘సైనికుల ధైర్య, సాహసాల వల్లే సాధ్యమైంది’

‘సైనికుల ధైర్య, సాహసాల వల్లే సాధ్యమైంది’

న్యూఢిల్లీ: ఇండియా భూభాగంలోకి ఏ విదేశీయులూ (చైనీయులు) రాలేదని, ప్రస్తుతం ఆ టెర్రిటరీలో ఎవరూ లేరని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై మోడీని విమర్శిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు పలు వ్యాఖ్యలు చేశారు. చైనా దూకుడుకు మోడీ లొంగిపోయారని, ఆ భూభాగం చైనాదే అయితే.. మన సైనికులు ఎందుకు చనిపోయారు? వాళ్లు ఎందుకు చనిపోయారు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. చైనాకు మోడీ క్లీన్ చిట్ ఇస్తున్నారా.. అంటూ కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబరం మండిపడ్డారు. దీంతో ఈ విషయంపై శనివారం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) స్పందించింది. ఈ విమర్శలను ప్రధాని మోడీకి ‘కొంటె వివరణ’ ఇచ్చే యత్నంగా పీఎంవో కొట్టి పారేసింది. ‘దేశ సైనికుల ధైర్య సాహసాల వల్ల మన వైపు ఉన్న లైన్ ఆఫ్​ యాక్చువల్ కంట్రోల్‌ (ఎల్‌ఏసీ) వద్ద చైనీయులు ఎవ్వరూ లేరని ప్రధాన మంత్రి పరిశీలనల ప్రకారం తెలిసింది. 16వ బిహార్ రెజిమెంట్ సైనికుల త్యాగాల వల్ల చైనా తలపెట్టిన నిర్మాణాలకు అడ్డుకట్ట పడటంతోపాటు.. ఆ రోజు ఎల్‌ఏసీ దగ్గర అతిక్రమణ యత్నాన్ని సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకున్నాం’ అని పీఎంవో పేర్కొంది.