మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్.. అదిరిన ఆడిషన్స్

మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్.. అదిరిన ఆడిషన్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఇండియా 2026 సీజన్–2 కోసం తెలంగాణ, ఏపీ ఆడిషన్స్ గురువారం జూబ్లీహిల్స్​లో  ఉత్సాహంగా జరిగాయి. డాక్టర్లు, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజినీర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, గృహిణులు ఇలా వివిధ రంగాలకు చెందిన 60 మంది మహిళలు ఇందులో పార్టిసిపేట్ చేశారు.

వీరిలో నుంచి జ్యూరీ మెంబర్స్ ప్రియాంక ఆనంద్, అబ్దుల్ సర్వర్, శ్రీదేవి విజయ దాస్ బృందం 30 మందిని ఫైనలిస్టులుగా సెలెక్ట్ చేశారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, హెల్త్, క్యాన్సర్ స్క్రీనింగ్​పై అవగాహన కల్పించడమే ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశమని ఫౌండర్ కిరణ్మయి అలివేలు తెలిపారు. మే 17న గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్లు ప్రకటించారు.