
నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా పి.మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. గురువారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ‘ఓ ఫ్రెండ్ ద్వారా ఈ కథ అనుష్క దగ్గరకు వెళ్లింది. ఆమెకు ఇంటరెస్టింగ్‌గా అనిపించి నెరేషన్ ఇవ్వమని పిలిపించారు. అక్కడే యూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. అనుష్కతో పాటు వాళ్లకూ కథ నచ్చింది. ఆ తర్వాత నవీన్‌కు కథ చెబితే మూడు నెలలు టైమ్ తీసుకుని ఓకే చెప్పాడు. ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉంటుంది కానీ అడల్ట్ కంటెంట్ కాదు.
అనుష్క, నవీన్ లాంటి యాక్టర్స్‌కు ఒక ఇమేజ్, క్రెడిబిలిటీ ఉంటుంది. కంటెంట్ బాగా లేకుంటే అసలు వాళ్లే ఈ సినిమా ఒప్పుకోరు. ఒక్క క్షణం కూడా ఇబ్బంది పడకుండా సినిమా చూడొచ్చు. ఫన్ ఎమోషన్ కలిసి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. మెసేజ్ అనేది నేరుగా చెప్పడం లేదు. కానీ కథలో ఆ మోరల్ ఉంటుంది. జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనే ఆలోచన ఉన్న ఒక అమ్మాయి పెళ్లి కాకుండా తల్లి అవడంలో సంతోషాన్ని కోరుకుంటుంది. అందుకోసం ఒక అబ్బాయి హెల్ప్ తీసుకుంటుంది. ః
ఇలా మొదలైన ప్రయాణం ఎక్కడ ముగిసింది. ఈ క్రమంలో ఆ జంటకు ఎదురైన పరిణామాలు ఏంటి. వాళ్లు మానసికంగా ఎలాంటి ఎమోషన్‌కు గురయ్యారు అనేది ఈ సినిమా స్టోరీలైన్. అన్ని సౌత్ లాంగ్వేజెస్‌లో మూవీని రిలీజ్ చేస్తున్నాం. సౌత్ నేటివిటీ ఉన్న కథ కావడంతో హిందీలో రిలీజ్ వద్దనుకున్నాం. చిరంజీవి గారు మా సినిమా చూసి అభినందించడంతో పెద్ద సక్సెస్ కొట్టిన ఫీలింగ్ కలిగింది’ అని చెప్పాడు.