మళ్ళీ నిరాశే.. నవీన్, అనుష్కల సినిమా వాయిదా

మళ్ళీ నిరాశే.. నవీన్, అనుష్కల సినిమా వాయిదా

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్‌ పొలిశెట్టి(Naveen Polishetty) స్టార్ బ్యూటీ అనుష్క(Anushka) జంటగా వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి(Mss shetty mister plishetty). ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్(UV Creations) తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మహేష్(Mahesh) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అవుతూనే ఉంది.  

ఈ సినిమాను ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటిచారు. కానీ ఆ డేట్ కి కూడా ఈ సినిమా రావడంలేదని చెప్పి మేకర్స్ మరోసారి ఫ్యాన్స్ కి హ్యాండ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఆగస్టు 4న మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించాము కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల కుదరడం లేదు. అందుకే ఈ సినిమాను మరోసారి పోస్ట్ ఫోన్ చేస్తున్నాము. ఆలస్యానికి మమ్మల్ని క్షమించండి. కానీ మిమ్మల్ని ఆనందింపచేసే మంచి ఎంటర్టైనర్ తో త్వరలోనే మీ ముందుకు వస్తాము అని రాసుకొచ్చారు. 

మేకర్స్ చేసిన ఈ ప్రకటనతో ఫుల్ డిజప్పాయింట్ లో మునిగిపోయారు నవీన్ అండ్ అనుష్క ఫ్యాన్స్. అంతేకాదు అసలు సినిమా రిలీజ్ అవుతుందా కాదా.. ఇన్ని సార్లు పోస్ట్ ఫోన్ చేయడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.