మిస్ యూనివర్స్ గా మెక్సికన్ సుందరి ఆండ్రియా మెజా

మిస్ యూనివర్స్ గా మెక్సికన్ సుందరి ఆండ్రియా మెజా

ఫ్లోరిడా: మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా 69వ యూనివర్స్ కిరీటాన్ని గెల్చుకుంది. అమెరికా, ఫ్లోరిడాలోని ప్రముఖ గిటార్ హోటల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టెలివిజన్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అందరు పోటీదారులను ఓడించి టైటిల్ నెగ్గిన ఆండ్రియాకు.. మాజీ మిస్ యూనివర్స్, సౌతాఫ్రికాకు చెందిన జోజోబిని తుంజీ కిరీటాన్ని పెట్టారు. 73 మంది అందగత్తెలను తోసిరాజని మెజా మిస్ యూనివర్స్ గా నిలిచింది. భారత్ నుంచి ఈవెంట్ లో పాల్గొన్న మిస్ ఇండియా అడెలైన్ క్యాస్టిలినో కుడా టైటిల్ కు గట్టిపోటీదారుగా భావించినా.. మెజానే విశ్వసుందరి వరించింది. దీంతో మిస్ యూనివర్స్ గా నిలిచిన మూడో మెక్సికన్ గా ఆమె ఘనతను మూటగట్టుకుంది.