హైదరాబాద్​కు మిస్ కెనడా .. స్వాగతం పలికిన అధికారులు

హైదరాబాద్​కు మిస్ కెనడా .. స్వాగతం పలికిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో నిర్వహించబోయే మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు అందగత్తెలు ముందుగానే హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ఈ నెల 6 నుంచి వస్తారని భావించినప్పటికీ మూడు రోజుల ముందే పోటీదారుల రాక మొదలైంది. శనివారం సాయంత్రం మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో అధికారులు స్వాగతం పలికారు. 

కాగా, మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి ఇప్పటికే హైదరాబాద్ కు వచ్చారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే ప్రాంతాలు, వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, టూరిజం అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు.  పోటీదారులకు హైటెక్​సిటీలోని రాడిసన్ హోటల్​లో అతిథ్యం ఇవ్వనున్నారు.