అందాల భామల రాక.. రిహార్సల్స్ కేక 

అందాల భామల రాక.. రిహార్సల్స్ కేక 

వెలుగు, హైదరాబాద్​సిటీ : సిటీ వేదికగా జరగనున్న మిస్​ వరల్డ్​ పోటీలకు ప్రపంచ నలుమూలల నుంచి అందాల భామలు తరలివస్తున్నారు. గురువారం పలుదేశాల ముద్దుగుమ్మలు సిటీకి చేరుకోగా శంషాబాద్​ ఎయిర్​పోర్టులో అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే సిటీకి విచ్చేసిన ఆయా దేశాల కంటెస్టెంట్లు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రిహార్సల్స్ చేశారు. స్టేజీపై నడకలు, నవ్వులతో, ఆకర్షణీయ కాస్ట్యూమ్స్​తో సందడి చేశారు.