
చెన్నైలో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు డే పేరుతో చేసిన చెలగాటం..విద్యార్థుల ప్రాణాల మీదికి తెచ్చింది. బస్ డే సందర్భంగా దాదాపు 30 మందికిపైగా స్టూడెంట్స్..బస్సు టాప్ పై కొందరు కూర్చుంటే..మరికొందరు నిల్చున్నారు. ఇంతలోనే బస్సు ముందు..ఓ బైక్ ఆగిపోయింది. దీన్నిచూసి బస్సు డ్రైవర్..సడెన్ బ్రేక్ వేశాడు. బస్సుపై ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా బస్సు కింద పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. తమిళనాడులో బస్సు డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు..అయితే అక్కడి సర్కార్ వీటిపై బ్యాన్ చేసింది. అయినా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి.