వేర్వేరు చోట్ల ఇద్దరు మిస్సింగ్ : నమ్మినందుకు ఎత్తుకెళ్లాడు

వేర్వేరు చోట్ల ఇద్దరు మిస్సింగ్ : నమ్మినందుకు ఎత్తుకెళ్లాడు

బక్రీద్ పర్వదినాన ఓ ముస్లిం ఫ్యామిలీలో తీరని విషాధం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఐదేళ్ల చిన్నారిని చేతులారా దూరం చేసుకున్నారు తల్లిదండ్రులు. వీరు చేసిన తప్పు ఓ వ్యక్తిని నమ్మడమే. బక్రీద్ సందర్భంగా పాలు తీసుకువెళ్లడానికి వెళ్లిన దంపతులు.. తన కూతురిని చూడమని అంతకుముందు పరిచయమున్న ఓ వ్యక్తికి చెప్పారు. తిరిగివచ్చే సరికి అతడు పాపతో పరారీ అయ్యాడు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ లో జరిగింది.

వివరాలు..యాప్రాల్ కు చెందిన రాజు..తన కూతురు ఫాతిమా(5)కు జ్వరం వచ్చిందని నీలోఫర్ హస్పిటల్ వెళ్లేందుకు.. భార్యతో కలిసి హైదరాబాద్ కు వచ్చాడు. నీలోఫర్ హస్పిటల్ కు వెళ్లేందుకు బస్ ఎక్కి ప్యాట్నీ దగ్గర దిగారు. అక్కడ రాజుకు కొన్ని సంవత్సరాల క్రితం కాగితాలు ఏరుకునేప్పుడు పరిచయం ఉన్న వ్యక్తి కలిశాడు. హాయ్ అంటూ అందరు కలిసి చాయ్ తాగారు. తర్వాత మాటలో మాటలు కలిపిన కాగితాల వ్యక్తి.. తనకు కూడా పని ఉందని చెప్పి రాజు ఫ్యామిలీతో వెళ్లాడు. మధ్యలో బక్రీద్ పాలు తాగేందుకు రాజు ఫ్యామీలీ నల్లగుట్టకు వెళ్ళుతుంటే అతడు కూడా వెళ్లాడు. నల్లగుట్టకు రాగానే రాజు ఫ్యామిలీ దగ్గర ఉన్న బ్యాగులు ఓ షాపు దగ్గర పెట్టి, కూతురును చూడమని ఆ కాగితాల వ్యక్తికి చెప్పారు.

పాలు తీసుకు రావడం గురించి రాజు అతడి భార్య వెళ్ళారు. పాలు తీసుకోని వచ్చేసరికి ఫాతిమా, కాగితాలు ఏరుకునే వ్యక్తి కనిపించకుండా పోయారు.అక్కడ చుట్టూ పక్కల వారిని అడుగగా కాగితాల వ్యక్తి బాలికను ఎత్తుకుని వెళ్ళాడని చెప్పారు.  దీంతో తమ బిడ్డను కిడ్నాప్ చేశాడని కన్నీరుమున్నీరైన రాజు.. రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగితాల వ్యక్తికి( 30)సంవత్సరాలు ఉంటాయని.. వైట్ కలర్ జీన్స్, గోధుమ కలర్ జెర్కిన్ వేసుకొని ఉన్నాడని పోలీసులకు తెలిపాడు రాజు.  ఆ వ్యక్తిని చుస్తే గుర్తు పట్టగలనన్నాడు. ఫాతిమా కలర్ చమన చాయ, దుస్తువులు తెలుపు, నలుపు, బ్లూ కలర్ గల ఫ్రాక్ , రెండు జేడలు వేసుకుని ఉంది. మేడలో పూసల దండ ఉందని పోలీసులకు తెలిపాడు బాలిక తండ్రి రాజు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

అల్వాల్ లో అబ్బాయి మిస్సింగ్..

అప్పటివరకు ఇంట్లో ఉన్న తమ కొడుకు ఆడుకుంటానని చెప్పి బయటికి వెళ్లి తిరిగిరాలేదని మరో కేసు నమోదైంది. అల్వాల్ కు చెందిన ఆటో డ్రైవర్ శ్రీను కొడుకు రాజు(15) టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఈ నెల 6న ఆడుకుంటానని గ్రౌండ్ కు వెళ్లిన కొడుకు ఇప్పటివరకు రాకపోయేసరికి మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలుడు బ్లాక్ కలర్ షర్ట్, ప్యాంట్ లో ఉన్నాడని తెలిపారు.