హీరోయిన్ మాయం: ప్రభాస్ పక్కన చాన్స్ అని చెప్పి…

హీరోయిన్ మాయం: ప్రభాస్ పక్కన చాన్స్ అని చెప్పి…

రాహు సినిమా హీరోయిన్ మిస్సింగ్ అయిందంటూ ఫిర్యాదు ఇచ్చారు ఆ సినిమా దర్శకుడు సుబ్బు. సోమవారం మధ్యాహ్నం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రముఖ దర్శకుడు సందీప్ వంగ పేరుతో హీరోయిన్ క్రితి గార్గ్ కు కాల్ వచ్చిందని..  ప్రభాస్ తో హిరోయిన్ గా చేసేందుకు సెలక్ట్ చేశామని అందుకుగాను ముంబైకి రమ్మని చెప్పినట్లు చెప్పారు. దీంతో సోమవారం పొద్దున క్రితి ముంబైకి వెళ్లింది. వెళ్లినప్పటినుంచి క్రితి ఫోన్ కలవడంలేదని తెలిపారు. దీంతో అజ్ఞాతవ్యక్తులు ఫోన్ చేసినట్లు తెలుసుకుని… పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు సుబ్బు.