చిలుకూరు అట‌వీ ప్రాంతానికి చిరుత‌

చిలుకూరు అట‌వీ ప్రాంతానికి చిరుత‌

హైద‌రాబాద్: కాటేదాన్ అండ‌ర్ బ్రిడ్జి రోడ్డుపై హ‌ల్ చ‌ల్ చేసి క‌నిపించ‌కుండా పోయిన చిరుత.. చిలుకూరు అట‌వీ ప్రాంతానికి వెళ్లిన‌ట్లు గుర్తించామ‌న్నారు అట‌వీశాఖ అధికారులు. చిరుత జాడ కోసం ఆ ప్రాంతంలో గ‌ట్టి నిఘా ఏర్పాటు చేశామ‌న్నారు. చిరుత‌ను బంధించ‌డం కోసం వ్య‌వ‌సాయ పొలంలో ఆహారాన్ని ఎర‌గా వేసిన‌ట్లు చెప్పారు. చిలుకూరు ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు అట‌వీశాఖ అధికారులు.

మే-14న కాటేదాన్ అండ‌ర్ బ్రిడ్జి రోడ్డుపై దాదాపు గంట‌సేపు అక్క‌డే ప‌డుకున్న చిరుత‌.. ఓ వ్య‌క్తిపై దాడి చేసి పారిపోయిన విష‌యం తెలిసిందే. రెండు రోజులుగా చిరుత కోసం గాలిస్తుండ‌గా.. శుక్ర‌వారం సాయంత్రం చిలుకూరు అట‌వీ ప్రాంతానికి వెళ్లిన‌ట్లు చిరుత‌ ఆన‌వాళ్లు గుర్తించామ‌ని చెబుతున్నారు అధికారులు.