కేటీఆర్ కనబడుట లేదు.. పోస్టర్లు వైరల్

కేటీఆర్ కనబడుట లేదు.. పోస్టర్లు వైరల్

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తప్పిపోయారంటూ రంగారెడ్డి జిల్లాలో కొన్ని పోస్టర్లు దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. వరద బాధితులు కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పోస్టర్లు అతికించారని సమాచారం. రంగారెడ్డిలోని జల్పల్లి, బందంగ్‌పేట్, బాలాపూర్, బాలాపూర్‌తోపాటు ఉస్మాన్ నగర్‌ వాసులు ఈ పోస్టర్లు వేశారని తెలుస్తోంది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డిలో పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వానలొస్తే ప్రతి ఏడాది ఈ ఇబ్బందులు తప్పట్లేదంటూ జిల్లా ప్రజలు వాపోతున్నారు. భారీ వానలకు రోడ్లపై నీళ్లు చేరడం, యాక్సిడెంట్లు అవ్వడం, అత్యవసర సర్వీసులు అందుబాటులో లేవంటూ ప్రభుత్వంపై జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేటీఆర్ ఎల్లప్పుడూ సింగపూర్, డల్లాస్ గురించే మాట్లాడుతారు. మీరు ఒకసారి మా ప్రాంతానికి వచ్చి చూడండి.. ఇక్కడి పరిస్థితులను చూస్తే వాస్తవాలేంటో మీకే తెలుస్తాయి. మేం మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని కించపరచడం లేదు. మా బాధల్ని తెలియజేస్తున్నాం అంతే’ అంటూ ఓ బాధితుడు వాపోయాడు.  

మరిన్ని వార్తల కోసం: 

పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. బూతులు తిడుతూ.. 

వాగులో కొట్టుకుపోతున్న వాహనదారుడ్ని కాపాడిన కానిస్టేబుల్

చెబితే వింటది..చెప్పింది చేస్తది