Mitchell Starc: వెస్టిండీస్‌తో మూడో టెస్ట్.. రెండు అరుదైన రికార్డ్స్‌కు చేరువలో స్టార్క్

Mitchell Starc: వెస్టిండీస్‌తో మూడో టెస్ట్.. రెండు అరుదైన రికార్డ్స్‌కు చేరువలో స్టార్క్

ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు అరుదైన ఘనతలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మోడ్రన్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ గా స్టార్క్ కు పేరుంది. 2011 లో న్యూజిలాండ్ తో టెస్ట్ అరంగేట్రం చేసిన స్టార్క్.. 14 ఏళ్ళ పాటు ఆస్ట్రేలియా క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా తరపున స్టార్క్ ఇప్పటికే 99 టెస్టులు ఆడేశాడు. జూలై 12 నుండి సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా మూడో టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ స్టార్క్ కు 100 టెస్ట్ కావడం విశేషం. దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తర్వాత ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్న రెండో ఆస్ట్రేలియా పేసర్‌గా స్టార్క్ నిలవనున్నాడు. 

టెస్ట్ ఫార్మాట్ లో స్టార్క్ ఇప్పటివరకు 395 వికెట్లకు పడగొట్టాడు. విండీస్ పై జరగనున్న రెండు టెస్టుల్లో స్టార్క్ 5 వికెట్లు తీసుకుంటే 400 వికెట్లు తీసుకున్న రెండో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గా నిలుస్తాడు. గ్లెన్ మెక్ గ్రాత్ (563) తొలి ఆసీస్ ఫాస్ట్ బౌలర్ గా ఈ ఘనతను అందుకున్నాడు. ఓవరాల్ గా ఆస్ట్రేలియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో స్టార్క్ (395) నాలుగో స్థానంలో ఉన్నాడు. తొలి మూడు  స్థానాల్లో షేన్ వార్న్ (708), గ్లెన్ మెక్ గ్రాత్ (563), నాథన్ లియాన్ (562) ఉన్నారు. స్టార్క్ 400 వికెట్లు పూర్తి చేసుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గా నిలవనున్నాడు. 

ALSO READ : ఆ రెండు విజయాలు ప్రత్యేకం.. లార్డ్స్‌లో ఘోరంగా టీమిండియా రికార్డ్స్

ఇప్పటివరకు  రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్‌లో స్టార్క్ 395 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 244, టీ20ల్లో 79 వికెట్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఓవరాల్ గా 719 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో షేన్ వార్న్ (1001), గ్లెన్ మెక్‌గ్రాత్ (949) మాత్రమే స్టార్క్ కంటే ముందున్నారు. బ్రెట్ లీ (718) నాలుగో స్థానానికి పడిపోయాడు. స్టార్క్ తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.