గాయంతో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఔట్

గాయంతో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఔట్

భారత్తో టీ20 సిరీస్కు ముందు ఆస్ట్లేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాట్స్మన్ మిచెల్ మార్ష్,ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్, బౌలర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు టీమిండియాతో టీ20 సిరీస్లో పాల్గొనడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ముగ్గురి స్థానంలో నాథన్ ఎల్లిస్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్‌లను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ సిరీస్లో ఇప్పటికే డేవిడ్‌ వార్నర్‌ ఆడటం లేదు. అతని  విశ్రాంతి తీసుకుంటానని చెప్పడంతో..క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ను ఎంపిక చేయలేదు. 

గాయాలతో దూరం..
కాలిమడమ గాయంతో మిచెల్‌ మార్ష్‌ ఇప్పటికే జింబాబ్వేతో రెండు వన్డేల్లో పాల్గొనలేదు. అంతేకాకుండా న్యూజిలాండ్‌తో మూడు వన్డేల్లోనూ ఆడలేదు. అటు  కివీస్‌తో రెండో వన్డే సమయంలోనే స్టాయినిస్‌ గాయపడ్డాడు.  టీమిండియా పర్యటనకు బయల్దేరే ముందు మోకాలి గాయంతో స్టార్క్‌ దూరమయ్యాడు. దీంతో ఈ ముగ్గురు సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని..
మార్ష్, స్టార్క్, స్టోయినీస్కు స్వల్ప గాయాలే అయినా..టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని క్రికెట్ ఆస్ట్రేలియా వారికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.  టీ20 ప్రపంచకప్‌కు కేవలం నెల రోజులే ఉండటంతో..కీలకమైన ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకే క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 20 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య  మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. సెప్టెంబర్ 20న మోహాలీలో తొలి టీ20, 23న నాగ్ పూర్లో రెండో టీ20 జరగనుంది. అలాగే 25న హైదరాబాద్లో లాస్ట్ టీ20 జరగనుంది. 

టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్‌ ఫించ్‌, టిమ్‌ డేవిడ్‌, స్టీవెన్‌ స్మిత్‌, మాథ్యూ వేడ్‌, కామెరాన్‌ గ్రీన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, పాట్‌ కమిన్స్‌, సేన్ అబాట్‌, ఏస్టన్‌ ఆగర్‌, నేథన్‌ ఎల్లిస్‌, హేజిల్‌వుడ్‌, జోష్‌ ఇన్‌గ్లిస్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, డేనియెల్‌ సామ్స్‌, ఆడమ్‌ జంపా

భారత జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్ పంత్‌, దినేశ్ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, యుజ్వేంద్ర  చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి, హర్షల్‌ పటేల్‌, దీపక్ చాహర్‌, జస్ప్రీత్‌ బుమ్రా

మరిన్ని వార్తలు