World Cup 2025 Final: లెజెండ్స్‌కు టీమిండియా గౌరవం: వరల్డ్ కప్ పట్టుకొని కన్నీరు పెట్టుకున్న ముగ్గురు దిగ్గజాలు

World Cup 2025 Final: లెజెండ్స్‌కు టీమిండియా గౌరవం: వరల్డ్ కప్ పట్టుకొని కన్నీరు పెట్టుకున్న ముగ్గురు దిగ్గజాలు

తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు తీవ్ర భావోద్వేగానికి గురైంది. సొంతగడ్డపై అభిమానుల మధ్య తొలిసారి వరల్డ్ కప్ టైటిల్ కల సాకారం చేసుకుంది. ఎన్నో ఏండ్ల కలను సాకారం చేసుకున్న ఇండియా అమ్మాయిల జట్టు ఎట్టకేలకు జగజ్జేతగా అవతరించింది. ఆదివారం (నవంబర్ 2) జరిగిన ఫైనల్లో హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా 52  రన్స్ తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 52 ఏళ్ళ వరల్డ్ కప్ చరిత్రలో భారత మహిళల జట్టుకు తొలి వన్డే వరల్డ్ కప్ కావడం విశేషం. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్ రౌండ్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ విజయం తర్వాత టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ ను మాజీ దిగ్గజాల చేతిలో పెట్టారు. వరల్డ్ కప్ టైటిల్ ను మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి, అంజుమ్ చోప్రా వంటి భారత మహిళా దిగ్గజాలకు టైటిల్‌ను అప్పగించడంతో వారికీ కన్నీళ్లు ఆగలేదు. మిథాలీ రాజ్ ట్రోఫీని కౌగిలించుకుని అలా ఉండిపోయింది. ఝులన్ గోస్వామి,అంజుమ్ చోప్రా భారత ఆటగాళ్లను హగ్ చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ముగ్గురు భారత క్రికెట్ కు చేసిన సహకారం మర్చిపోకూడదు. టీమిండియా తరపున ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ త్రయం.. దేశం కోసం ఎంతగానో పోరాడినప్పటికీ వరల్డ్ కప్ ను అందించలేకపోయారు. 

12 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌‎లో హోమ్‌‌‌‌ అడ్వాంటేజ్‌‎ను సద్వినియోగం చేసుకోని ప్రపంచ ఛాంపియన్ లుగా టీమిండియా అవతరించింది. 2005, 2017 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వచ్చినా తుది మెట్టుపై బోల్తా పడింది. ఈ రెండు వరల్డ్ కప్ లో మిథాలీ, గోస్వామి జట్టును ఫైనల్ కు చేర్చినా టైటిల్ ను అందించడంలో విఫలమయ్యారు. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరగనుండడంతో ఫ్యాన్స్ ఈ సారి మన మహిళల జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టే టైటిల్ కలను సాకారం చేసుకొని దిగ్గజాలకు అంకితం చేసింది.

ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డీవై పాటి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఓపెనర్ షెఫాలీ వర్మ (78 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87; 2/36),  దీప్తి శర్మ (58 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 58; 5/39) ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ మెరుపులతో హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా 52  రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 298/7 స్కోరు చేసింది.అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సఫారీ టీమ్ 45.3 ఓవర్లలో 246 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటై ఓడింది. కెప్టెన్ లారా వోల్‌‌‌‌‌‌‌‌వార్ట్ (98 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 101) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌, దీప్తికి ప్లేయర్ అఫ్ ద సిరీస్​ అవార్డులు లభించాయి.