
అహ్మదాబాద్: లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ టీమ్‌కు మెంటార్, అడ్వైజర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఫస్ట్ సీజన్‌కు ముందు ఫ్రాంచైజీతో ఆమె ఒప్పందం చేసుకుంది. గుజరాత్లో విమెన్స్ క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు.. మెంటార్‌గా మిథాలీ సపోర్ట్ అందించనుంది. మార్చిలో జరిగే డబ్ల్యూపీఎల్‌లో ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. గత వారం జరిగిన ఫ్రాంచైజీల వేలంలో అదానీ గ్రూప్ రూ. 1298 కోట్లతో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. విమెన్స్ క్రికెట్ డెవలప్కావడానికి బీసీసీఐ తీసుకున్న చొరవ చాలా బాగుందని మిథాలీ కితాబిచ్చింది. యంగ్‌స్టర్స్ క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా తీసుకునేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పింది.