ఏం పనులండీ : మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ సస్పెండ్

ఏం పనులండీ : మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ సస్పెండ్

బాధితులను రక్షించాల్సిన పోలీస్.. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీస్.. అందులోనూ సర్కిల్ఇన్ స్పెక్టర్.. స్టేషన్ కు వచ్చిన మహిళా బాధితురాలితో ఆయనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. భర్త కొడుతున్నాడు.. వేధిస్తున్నాడు.. చర్యలు తీసుకోండి అంటూ ఓ మహిళ.. మియాపూర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కంది. విచారించి.. వివరాలు కనుక్కుని న్యాయం చేయాల్సిన మియాపూర్ సీఐ.. సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్.. ఆ బాధిత మహిళతోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల తన భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చింది. అయితే.. తన ఫిర్యాదు తీసుకోకుండా మహిళ పట్ల సర్కిల్ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు నేరుగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేసింది. సీపీ విచారణకు ఆదేశించగా... వేధింపులు నిజమని తేలటంతో.. సీఐ ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. 

Also Read : ఎస్ఐ మోసం చేశాడంటూ యువతి నిరసన .. నిజామాబాద్ ​డివిజన్​లో ఘటన