మియాపూర్లో భర్తను రెండో భార్య చంపిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

మియాపూర్లో భర్తను రెండో భార్య చంపిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

మియాపూర్‌, వెలుగు: మియాపూర్లో భర్తను రెండో భార్య చంపిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.కోట్ల విలువైన ఆస్తిని కాజేసేందుకే ఈ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

బుధవారం కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. మియాపూర్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన పెంటేశ్(57) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు వ్యవసాయం చేసేవాడు. మొదటి భార్య స్వరూపతో విభేదాల కారణంగా వేరుగా ఉంటున్నాడు.

అనకాపల్లికి చెందిన సత్యవతిని 2009లో రెండో వివాహం చేసుకున్నాడు. పెంటేశ్​ ఆస్తిపై కన్నేసిన సత్యవతి అతడిని చంపాలని డిసైడ్​ అయింది. తన ప్రియుడు మధుసూదన్‌రెడ్డి సాయం కోరింది. గతేడాది నవంబర్‌ 19న పెంటేశ్​కు భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెట్టగా స్పృహ కోల్పోయాడు. 

►ALSO READ | హైదరాబాద్లో దొంగ పనితనం.. చోరీలు చేసి అప్పులు తీర్చిండు..!

అనంతరం ప్రియుడు మధుసూదన్‌రెడ్డి, అతని స్నేహితుడు రాజేశ్​తో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ కేసులో సత్యవతి, మధుసూదన్‌రెడ్డి, రాజేశ్​ను అరెస్టు చేసి రూ.2 లక్షలు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సత్యవతిపై అనుమానం ఉందని మృతుడి సోదరి సంధ్య గత ఏడాది డిసెంబర్‌ 30నే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.