హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్.. కొద్ది నెలల్లో పెండ్లి.. ఇంతలోనే ఇలా చేసుకున్నడు !

హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్.. కొద్ది నెలల్లో పెండ్లి.. ఇంతలోనే ఇలా చేసుకున్నడు !

మియాపూర్, వెలుగు: కొద్ది నెలల్లో పెండ్లి జరగాల్సి ఉండగా, సాఫ్ట్​వేర్ ఉద్యోగి సూసైడ్ ​చేసుకున్నాడు. హైటెక్​సిటీలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న అనిల్ అమిత్‌‌‌‌ చావ్డా(30) మియాపూర్​లోని హఫీజ్‌‌‌‌ పేటలో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి ఇటీవల ఓ యువతితో నిశ్చితార్థం జరగగా, నవంబర్​లో పెండ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లి అమిత్ డోర్​వేసుకున్నాడు. 

తల్లి ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా, సీలింగ్ ఫ్యాన్​కు ఉరేసుకొని కన్పించాడు. పెండ్లి విషయంలో నిరాశతోనే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి హీనా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.