మిజోరంలో 77 శాతం..చత్తీస్ ఘడ్లో 70.87 శాతం పోలింగ్

మిజోరంలో 77 శాతం..చత్తీస్ ఘడ్లో 70.87 శాతం పోలింగ్

మిజోరం, చత్తీస్ ఘడ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మిజోరంలో 40 స్థానాలకు..చత్తీస్ ఘడ్ లో తొలి దశలో  20 స్థానాలకు పోలింగ్ జరిగింది.   నవంబర్ 7న సాయంత్రం 5 గంటల వరకు మిజోరంలో  77.04 శాతం..   చత్తీస్ ఘడ్ లో  70.87 శాతం  పోలింగ్  నమోదయ్యింది.  పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

మిజోరంలోని  టుయిచాంగ్ నియోజకవర్గంలో 82.39 శాతం, టుయికుమ్‌లో 87.32 శాతం, తూర్పు తుయ్‌పుయ్‌లో 79.01 శాతం, లాంగ్ట్లై వెస్ట్‌లో 80.80 శాతం ఓటింగ్ నమోదైంది. మిజోరంలో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,276 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీరిలో 18 మంది మహిళలు ఉన్నారు.  

చత్తీస్ ఘడ్ లో మొత్తం 90 స్థానాలకు గానూ తొలి దశలో 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.   25 మంది మహిళలు సహా మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.. మొదటి దశలో 5,304 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మిగతా 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది.