
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్ కీలకమైన మొదటి సంతకం కోవిడ్ రిలీఫ్ ఫండ్ పై సంతకం చేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డున్న2.07 కోట్ల కుటుంబాలకు రూ.4 వేల చొప్పున కోవిడ్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి విడత కింద ఈ నెలలో రూ.2 వేలు అర్హులైన వారి అకౌంట్లో జమకానున్నాయి. అలాగే రాష్ట్రంలో లీటర్ పాల రూ.3 తగ్గింపు.. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.